కామారెడ్డి, ఆగష్టు 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన హీనబేగం గర్భిణికి బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యుడు క్యాట్రియాల రవి స్పందించి బి పాజిటివ్ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళకు రక్తం అవసరం అనగానే స్పందించి ముందుకు వచ్చినందుకు కామారెడ్డి రక్తదాతల సమూహం తరఫున రక్తదాతకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వి.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ పాల్గొన్నారు.