నిజామాబాద్, ఆగష్టు 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిర్దిష్టమైన లక్ష్యంతో పని చేస్తే ఏదైనా సాధించవచ్చునని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక వినాయక్ నగర్
రుక్మిణి చాంబర్స్‌లో దేశ్ఫాండే ఫౌండేషన్, కాకతీయ సైన్ బోర్డ్ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఆగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్, టి.ఎన్ జి వోస్ సంస్థ ద్వారా 6 నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇస్తున్న శిక్షణను పరిశీలించారు. వారికి ఏ విధంగా శిక్షణ అందిస్తున్నారో విద్యార్థులను స్వయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం జక్రాన్‌పల్లి మండలం పూప్పాలపల్లి గ్రామంలో దేశ్‌పాండే ఫౌండేషన్ సలహాలతో రైతు ప్రభాకర్ చేస్తున్న శ్రీ వరి సాగును పరిశీలించారు. రైతుతో మాట్లాడి శ్రీ వరిసాగుకు ఫర్టిలైజర్, ఇతర మందుల వాడకం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒకేసారి వాడినట్లు రైతు తెలిపారు. సాధారణ వరి సాగుకు ఫర్టిలైజర్ ఎక్కువ వాడడం జరిగిందని తెలిపారు.
కలెక్టర్ వెంబడి దేశ్‌పాండే ఫౌండేషన్ పౌండర్ రాజిరెడ్డి సామా ఫణీంద్ర, సీఈవో వివేక్, సెక్రెటరీ రవిష్ అగస్త్య ఫౌండేషన్ నిజామాబాద్ ఏరియా ఇన్చార్జ్ శ్రీదేవి మేనేజర్ వీరేశ్ పాణి, ఎండిఓ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.