కామారెడ్డి, ఆగష్టు 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజికవర్గంలోని 8 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 3 లక్షల 11 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 901 మందికి 5 కోట్ల 51 లక్షల 78 వేల 400 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.
ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి, రోడ్డు ప్రమాదాలను గురై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఖర్చయిన డబ్బులను ముఖ్యమంత్రి సహయనిధి నుండి ఇప్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన పత్రాలను తమ కార్యాలయంలో ఇవ్వాలని తెలిపారు. అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.