నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భక్తులకు తిరుమల కొండపై ఇకపై గోఆధారిత సంప్రదాయ భోజనం అందించనున్నారు. వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. త్వరలో పలుప్రాంతాల్లో భక్తులకు సాంప్రదాయ భోజనం అందుబాటులోకి రానుంది.
ఆహార పదార్థాలు ఉత్పత్తికి అయ్యే ఖర్చుకు సమానమైన ధరకే భక్తులకు అందజేయాలని టిటిడి నిర్ణయించింది. అన్నమయ్య భవన్లో గురువారం ప్రయోగాత్మకంగా సంప్రదాయ భోజనం ప్రారంభించారు.