ఆర్మూర్, ఆగష్టు 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమింపబడిన అర్గుల్ సురేష్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులుని గురువారం ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షులు కోటపాటి నరసింహ నాయుడు ఘనంగా సన్మానించారు. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం సమావేశం ఇటీవల కరీంనగర్లో జరిగిన సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు గజ్జల కాంతం, సురేష్‌కి నియామక పత్రం అందజేశారు.
సురేష్ అనేక సంవత్సరాలుగా దళితుల అభ్యున్నతి కోసం నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా చేస్తున్న కృషిని గుర్తించి రాబోయే రోజుల్లో మరింతగా సంఘం యొక్క విస్తరణ కొరకు సరైన నాయకుడిగా గుర్తించి నియమించిన సందర్భంగా కోటపాటి, సురేష్‌ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మానేటి లింబాధ్రి మాజీ ఎంపిటిసి పెర్కిట్, వెల్మ రాజేంధర్ నాయకులు, మాధరి నరేష్, ఎం.శేఖర్, మేకల నిఖిల్ పాల్గొన్నారు.