ఆర్మూర్, ఆగష్టు 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెర్కిట్ హరిప్రియ వైన్స్ పక్కన గుర్తు తెలియని శవం 40 సంవత్సరాల వయసుగల వ్యక్తిని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.
అనంతరం పెర్కిట్ ఐదవ వార్డు కౌన్సిలర్ ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామన్నారు.