నందిపేట్, ఆగష్టు 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట గ్రామానికి ఏమైంది, సర్పంచ్ లేరు, ఉప సర్పంచ్ లేరు గ్రామ సెక్రెటరీ ఉన్న పట్టించుకోవడం లేదు.. ఇటీవల పిచ్చి కుక్కలు చిన్నపిల్లలను ఆవులను పెద్దమనుషులను కరిశాయి. దీనిపై కొందరు యువకులు సెక్రెటరీని ప్రశ్నిస్తే ఏ సమాధానం కూడా చెప్పలేదని ఎంపిటిసి అరుణ భజరంగ్ చవాన్ పేర్కొన్నారు. కార్యదర్శి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నాడని, అందుకే కాబోలు మనకు చెత్త అవార్డు వచ్చిందని ఎద్దేవా చేశారు. నందిపేట్లో ఎక్కడి చెత్త అక్కడే అన్న చందంగా తయారైందన్నారు. మురికి నీరు రోడ్లపై గుంతల్లో నిలిచిపోయి దోమలకు నిలయంగా మారిందన్నారు.
అలాగే భవన నిర్మాణాల విషయంలో అక్రమంగా అనుమతులు ఇస్తున్నారని, దీన్ని గ్రామ పెద్దలు వ్యతిరేకించినా, తిరిగి అనుమతి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారన్నారు. సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగినా ఇవ్వడం లేదని పేర్కొన్నారు.