నిజామాబాద్, ఆగష్టు 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి ప్రాంతంలో వైఎస్ఆర్టిపి పార్టీ జండాను సయ్యద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా పార్టీ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కో కన్వీనర్ బుస్సాపూర్ శంకర్ హాజరై మాట్లాడారు.
నిజామాబాద్ జిల్లాలో వైఎస్ఆర్ తెలంగాణా పార్టీకి ప్రజల్లో మంచి స్పందన వస్తుందని, రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలో వచ్చే విధంగా పనిచేస్తామన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువకులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో షేక్ అమాన్ అహ్మద్, మొహమ్మద్ జునైద్, షేక్ ఖలీద్, షేక్ అస్లాం, మహ్మద్, మన్సూర్, హమీద్, షేక్ ఫయ్యూమ్, అబ్బాస్, అబ్దుల్ రబ్ సాబ్, జైలు జలీల్, అబ్దుల్ జబ్బార్, షేక్ అహ్మద్, జోయెబ్, సమీర్, మహ్మద్ అయూబ్, అబ్దుల్ రఖీబ్, మహ్మద్ ఫైజ్, అమన్ షా తదితరులు పాల్గొన్నారు.