కామారెడ్డి, ఆగష్టు 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు అసౌకర్యం కలుగకుండా సకాలంలో ధరణి రిజిస్ట్రేషన్స్ జరగాలని, ధరణి పెండిరగ్ దరఖాస్తులు వచ్చే సోమవారం వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆర్డీవోలు, తహశీల్దార్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో ధరణి, సీఎంఆర్ మిల్లింగ్ పై మండలాల వారీగా సమీక్షించారు. ధరణి రిజిస్ట్రేషన్స్ సంబంధించి ఉదయం పదిన్నర గంటలకు స్లాట్లు బుక్ అవుతున్నందున, తహశీల్దార్‌లు ఉదయం 10 గంటల 20 నిమిషాలకు లాగిన్ అయి ఉండాలని, తద్వారా రైతులకు అసౌకర్యం కలుగకుండా ఉంటుందని అన్నారు.
పెండిరగ్ దరఖాస్తులను ఆర్డీవోలు డివిజన్ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకొని కారణాలు విశ్లేషించుకోవాలని, దరఖాస్తులను సత్వరమే పరిష్కరించి తగిన చర్యలు చేపట్టాలని, వచ్చే సోమవారంలోగా దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని సూచించారు. ధరణిలో పట్టాదారు ఆబ్సెంట్ అయినట్లయితే అతని మళ్లీ కాంటాక్ట్ చేయాలని సూచించారు.
మిల్లింగ్ సంబంధించి ప్రతి రోజూ నివేదిక సమర్పించాలని తెలియజేస్తూ, ప్రతిరోజు ఎంత అనేది ముందస్తు కార్యాచరణతో లక్ష్యాన్ని సాధించాలని తెలిపారు. ఇప్పటివరకు ఖరీఫ్‌కు సంబంధించి 85 శాతం, రబీకి సంబంధించి 15 శాతం పూర్తి అయిందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్సులో కామారెడ్డి, ఎల్లారెడ్డి ఆర్డిఓ ఎస్.శ్రీను, జిల్లా పౌరసరఫరాల ఇంచార్జ్ అధికారి రాజశేఖర్, కలెక్టరేట్ ఏవో రవీందర్, సూపరింటెండెంట్ నారాయణ, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.