నిజామాబాద్, ఆగష్టు 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ నుండి నాలుగు నెలలపాటు అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఫారెస్ట్ రీజనరేషన్‌పై ఫారెస్ట్ అధికారులు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ పునరుద్ధరణకు ప్రస్తుతం మంచి వాతావరణం ఉన్నదని వచ్చే నాలుగు నెలలు ఫారెస్ట్ ఎఫ్‌ఆర్‌వోలు, శిక్షణ ఆఫీసర్స్, బీట్ ఆఫీసర్స్ గ్రాస్ రూట్ లెవెల్ నుండి చూడాలన్నారు. 20 మండలాలలో 184, గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న ఫారెస్ట్ 125 బీట్స్ రెగ్యులర్‌గా పరిశీలించి పునరుద్ధరణ పనులు వంద శాతం శాచ్యురేషన్ పద్ధతిలో పనులు ఐడెంటిఫై చేయాలని తెలిపారు.
ఫారెస్టు పునరుద్ధరణకు ఏది అవసరం ఉంటే ఆ వర్క్ గుర్తించి వారంలో ప్రపోజల్ పంపాలని తెలిపారు. వచ్చే వారం వరకు ఎంపీడీవోలు ఎస్టిమేషన్ పంపాలన్నారు. లేబర్ మోటివేషన్ చేయాలని సోమవారం నుండి కూలీలు గ్రామపంచాయతీలలో 25 శాతం తగ్గకుండా ఉండాలన్నారు. నాలుగు నెలలు వర్కు జరిగే విధంగా ప్లాన్ చేయాలని వర్క్ వంద శాతం చేయాలని ఒకరికి 237 రూపాయలు రోజు వచ్చే విధంగా పని చేయించాలన్నారు. లేబర్ ఎంత పని చేస్తే అంత డబ్బులు రావాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చిత్ర మిశ్రా, డిఎఫ్‌ఓ సునీల్, జడ్పీ సీఈఓ గోవింద్, డిఆర్‌డిఓ చందర్ నాయక్, డిపిఓ జయసుధ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.