కామారెడ్డి, ఆగష్టు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కలాభైరవ మండల సమాఖ్య లో ఐదవ మహాజన సభ నిర్వహించారు. కార్యక్రమంలో దశరత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. మహిళా సంఘాలు బ్యాంకు ఋణాలు తీసుకొని సకాలంలో చెల్లించాలని సూచించారు. ఇట్టి రుణాలను ఆదాయ అబివృద్ది కార్యక్రమాలకు వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో అడిషనల్ డి.ఆర్.డి.ఓ మాట్లాడుతూ పొదుపు సంఘాలు ఆర్థికంగా ముందుకు రావాలని, బ్యాంకు రుణాలు తీసుకొని సాజికంగా ఎదగాలని ఆదాయ అబివృద్ది కార్యక్రమాలు, పిండి గిర్నిలు, కిరాణం షాపులు, పప్పు మిల్లులు ఏర్పాటు చేసుకొని స్త్రీనిది ద్వార రుణాలు తీసుకొని పాడి పశువులు కొనుగోలు చేయాలని చెప్పారు.
సమావేశంలో కొత్తగా పాలక వర్గ సభ్యులు, అద్యక్షులు సౌజన్య , ఉపాధ్యక్షురాలు టి.రాజమణి, దాసరి పోచవ, కార్యదర్శి, గుర్రా అనసూయ, సహాయ కార్యదర్శి కోశాదికారి చౌకి అనిత ఎన్నికయ్యారు.