బోధన్, ఆగష్టు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్మిక ప్రయోజనాలకు నష్టం కలిగించే మోడీ సర్కార్ తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని మల్లేష్ డిమాండ్ చేశారు. శనివారం రుద్రూర్‌లో బీడీ కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
మంచిర్యాల జిల్లా సుమంగళి ఫంక్షన్ హాల్‌లో ఐఎఫ్‌టియూ రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నామని దానిలో కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్స్ అమలును నిలిపి వేయాలని, కాంట్రాక్టు వర్కర్స్ రెగ్యులరైజ్ కై, అసంఘటిత రంగ కార్మిక సామాజిక భద్రతకై సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సుప్రీం కోర్టు తీర్పు అమలు తదితర డిమాండ్ల సాధనకై సభ జరుగుతుందని ఐ.ఎఫ్.టి.యు శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో లత, సావిత్రి, గంగామణి, లలిత, సౌజన్య, రాణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.