ఆర్మూర్, ఆగష్టు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం సెప్టెంబర్ 1 వ తారీఖు నుండి ప్రారంభం కాబోతున్న పాఠశాలలను శానిటైజ్ చేయాలనీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన సూచన మేరకు ఆర్మూర్ పట్టణంలోని రెండవ వార్డులోని వడ్డెర కాలనీ ప్రభుత్వ పాఠశాలలో మున్సిపల్ సిబ్బంది శానిటైజ్ చేశారు.
పరిసరాలను పరిశుభ్రం చేసారు. పనులను కౌన్సిలర్ సంగీత ఖాందేష్ పర్యవేక్షించారు. ఈ సందర్బంగా సంగీత మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశానుసారం శానిటైజ్ చేయించడం జరిగిందని, విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించి పాఠశాలలకు హాజరు కావాలని కోరారు.
కార్యక్రమములో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయురాలు సునీత, ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, తెరాస నాయకులు ఖాందేష్ సత్యం, జాగృతి నియోజకవర్గ కన్వీనర్ మక్కల సాయినాథ్, నరేశ్, చంటి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.