నిజామాబాద్, ఆగష్టు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జర్నలిస్టు తీన్మార్ మల్లన్నను అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని దీనిని తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కమిటీ ఖండిస్తున్నామనీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం కన్వీనర్ అశోక్ కాంబ్లే అన్నారు.
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికి తీస్తున్న తీన్మార్ మల్లన్నను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపడం ఖండిస్తున్నామని, ఆయనకు తెలంగాణ సంక్షేమ సంఘం అండగా ఉంటుందన్నారు. తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయనపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకొని ఆయనకు రక్షణ కల్పించాలని అన్నారు. జర్నలిస్టు తీన్మార్ మల్లన్నకు న్యాయం జరిగేంత వరకూ తెలంగాణ జన సంక్షేమ సంఘం అండగా ఉంటుందని అన్నారు.