ఆర్మూర్, ఆగష్టు 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూరులో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ రూరల్ బ్రాంచ్ ప్రారంభించారు. ఆర్మూర్‌లో మోర్ సూపర్ మార్కెట్ పైన రెండో అంతస్తులో ఆఫీస్ ప్రారంభోత్సవం చేయగా ముఖ్యఅతిథిగా జి. సురేష్ అసిస్టెంట్ జోనల్ మేనేజర్, సీనియర్ టెరిటరీ మేనేజర్ గోపు కుమార్, అసిస్టెంట్ టేరిటరీ మేనేజర్ అంజి రెడ్డి, బ్రాంచ్ మేనేజర్ వెంకట స్వామి, సేల్స్ మేనేజర్ వర్దినేని శ్రీనివాస్, అందే లక్ష్మిపతి, ఏజెంట్లు, కస్టమర్లు పాల్గొన్నారు.
ఇదివరకు నిజామాబాద్ నగరంలో బ్రాంచ్ ఉండడంతో ఆర్మూర్ డివిజన్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్లకు సులభతరం కొరకు ఇప్పుడు వారి యొక్క సేవలు ఆర్మూర్ పట్టణంలో ఆఫీసులో అందుబాటులోకి వచ్చినందుకు పలువురు కస్టమర్లు ఆనందం వ్యక్తం చేశారు. కొత్తగా పాలసీలు తీసుకునే వారికి ఆన్‌లైన్‌తో పాటు సమీపంలో బ్రాంచ్ ప్రారంభోత్సవం హర్షనీయమని పలువురు పాలసీదారులు తెలిపారు.