నిజామాబాద్, ఆగష్టు 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తీన్మార్ మల్లన్న అరెస్టుకు నిరసనగా తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ప్రశాంతంగా మౌనదీక్షకు తరలి రావాలని టిజేఎస్ఎస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు టిజేఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గౌటీ రామకృష్ణ బహిరంగ పిలుపునిచ్చారు.
సోమవారం ఉదయం 11 గంటలకు గన్ పార్క్ వద్దగల అమరవీరుల స్థూపం వద్ద జరిగే మౌనదీక్షకు పార్టీలకు, సంఘాలకు అతీతంగా అందరూ రావాలని వారు పిలుపునిచ్చారు. గత కొద్ది సంవత్సరాలుగా మీడియాపై, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిరచే ప్రతి జర్నలిస్టు, ప్రతి ప్రజాస్వామ్యకవాది స్వచ్ఛందంగా తరలి రావాలని, తీన్మార్ మల్లన్నకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు తప్పకుండా భారీ సంఖ్యలో హాజరు కావాలని, మల్లన్నకు అండగా నిలుస్తున్నట్లే.. తెలంగాణలో ఏ జర్నలిస్టుకు అన్యాయం జరిగినా.. తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఎప్పటిలాగే ఇప్పుడు కూడా స్పందిస్తున్నట్లు సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కోరుతున్నారు.