ఆర్మూర్, ఆగష్టు 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం సంతోష్ నగర్‌లో నివసించే సట్టి నడిపి నర్సయ్య ఇటీవల అనారోగ్యంతో అసుపత్రిలో చికిత్సపొందాడు. ఇందుకోసం అయిన ఖర్చును ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సిఎంఆర్‌ఎఫ్ నిధుల నుండి 23 వేల రూపాయలను మంజూరు చేయించారు. కాగా మంగళవారం చెక్‌ను లబ్దిదారునికి మున్సిపల్ 2 వ వార్డ్ కౌన్సిలర్, ప్రముఖ మహిళా న్యాయవాది, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు సంగీత ఖాందేష్ అందజేశారు.
చెక్కులు తీసుకున్న బాధిత కుటుంభ సభ్యులు జీవన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సంగీతా మాట్లాడుతూ ఎవరికి ఏ ఆపద వచ్చినా మేమున్నాం అని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇచ్చే ధైర్యము, అందించే అభయహస్తం చాలా గొప్పదని, పేద ప్రజలకు కొండంత అండ లభిస్తుందన్నారు. కార్యక్రమములో తెరాస నాయకులు ఖాందేష్ సత్యం, నరేశ్, నవీన్, విష్ణు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.