కామారెడ్డి, ఆగష్టు 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులు, డ్యాములు అన్ని కూడా పూర్తిగా నిండి ఉన్నవి అన్న విషయం మనందరికీ తెలిసిందే, అదేవిధంగా గత 2-3 రోజుల నుండి అంతటా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కామారెడ్డి జిల్లా పోలీసు అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పురాతన ఇండ్లు, చెట్ల కింద ఉన్న నివాసపు గుడిసెలు కూలే అవకాశం ఉందని, చెరువులు, కుంటలు, కాలువలు అన్నీ కూడా నీటితో నిండి ఉన్నాయని, చుట్టూ ఉన్న ప్రాంతాలు అన్నీ కూడా తడిసి ఉన్నందున కాలుజారి నీటిలో/ప్రవాహాలలో పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలన్నారు.
చేపలు పట్టడానికి చెరువులు, వాగుల దగ్గరి ఎవరు వెళ్ళకూడదని, రోడ్డుపై నుంచి నీరు ప్రవహిస్తున్న దారుల గుండా ప్రయాణించక పోవడం మంచిదని సూచించారు. రోజూ చూసిన ప్రాంతమే కదా తెలిసిన ప్రదేశమే కదా అని నీటితో నిండి ఉన్న ప్రదేశాలకు వెళ్లకపోవడం మంచిదని, ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుండి సురక్షితంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారన్నారు.
తమరు తమ గ్రామంలో వర్షాల వలన ఎటువంటి అంతరాయం ఏర్పడిన, ఏర్పడే అవకాశం కలదు అని తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు, లేదా కింద తెలియజేసిన పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్‌కు ఫోన్ చేసి తెలపాలన్నారు.
9490617633
08468బి226633