వేల్పూర్, ఆగష్టు 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో కరోణ వైరస్ కారణంగా పాఠశాలలు మూసివేసిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం విద్యాశాఖ ఆదేశాలమేరకు సెప్టెంబర్ ఒకటి నుండి పాఠశాలలను ప్రారంభం చేసేందుకు అధికారులు, ఉపాధ్యాయబృందం ఏర్పాట్లు చేస్తోంది.
విద్యార్థిని విద్యార్థులు చిన్నారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.