కామారెడ్డి, ఆగష్టు 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరగడం వల్ల వివిధ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డెంగ్యూ బాధితులకు ప్లేట్ లేట్ల సంఖ్య తగ్గిపోవడంతో ప్రతిరోజు 15 నుండి 20 మంది ప్లేట్ లేట్లు అవసరం ఉన్నాయని కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని సంప్రదించడం జరుగుతుందని నిర్వాహకులు బాలు తెలిపారు.
దాతల కొరత వలన, చాలామందికి అవగాహన లేకపోవడం వలన ప్లేట్ లెట్ల్స్ దానం చేయడానికి ముందుకు రావడం లేదని ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తులు 15 రోజులకు ఒకసారి చొప్పున నెలలో రెండు సార్లు సంవత్సరానికి 24 సార్లు ప్లేట్ లేట్ల దానం చేయవచ్చునని కావున మానవతా దృక్పథంతో స్పందించి ప్లేట్ లేట్‌లు దానం చేయడానికి యువకులు ముందుకు రావాలని దాతలు 9492874006 కు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.