కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవళి అనే గర్భిణీకి అత్యవసరంగా చికిత్స నిమిత్తమై బి నెగిటివ్ రక్తం అవసరం ఉండగా వారి కుటుంబ సభ్యులు రక్తదాతల సమూహ నిర్వాహకులు బోనగిరి శివకుమార్‌ను సంప్రదించారు. కాగా పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి అశోక్ రెడ్డి సహకారంతో వారికి కావాల్సిన అత్పల్పంగా లభించే బి నెగిటివ్ రక్తం అందజేశారు. …
Read More »Monthly Archives: September 2021
గోర్గల్ చెరువులో చేప పిల్లల విడుదల
నిజాంసాగర్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం నుండి గోర్గల్ దేవుని కుంట చెరువులో నాయకులు పిరిని సాయిలు, గ్రామ టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు సుభాష్, పంచాయతీ కార్యదర్శి వెంకట్ రాంరెడ్డి కలసి తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల కోసం 100 శాతం రాయితీ కింద చేపపిల్లలను ఇవ్వడం జరిగిందని వాటిని చెరువులో విడుదల చేశామన్నారు.
Read More »బైపాస్ రోడ్డు మరమ్మత్తు
నారాయణఖేడ్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు నారాయణఖేడ్ పట్టణంలో రోడ్లు, ఇండ్లు దెబ్బతిన్నాయి. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మున్సిపల్ పరిధిలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు ఇచ్చిన హామీని సత్వరమే అమలు చేశారు. ఎమ్మెల్యే ఆదేశానుసారం గురువారం పట్టణంలోని బైపాస్ రోడ్డు నుండి సేవాలాల్ చౌక్ వరకు దెబ్బతిన్న రోడ్డును ఖేడ్ మున్సిపల్ కమిషనర్ మల్ల రెడ్డి, …
Read More »కామారెడ్డికి కేంద్రం బృందం
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి కేంద్ర బృందం సభ్యులు గురువారం వచ్చారు. జాయింట్ సెక్రెటరీ, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చరణ్ జిత్ సింగ్, డైరెక్టర్ మినిస్టరీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ ఆర్. పి .సింగ్‌కు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే పుష్పగుచ్ఛాలు ఇచ్చి …
Read More »గంజాయి మొక్కలను దగ్దం చేసిన ఆబ్కారీ అధికారులు
నారాయణఖేడ్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చెరకు పంటలో అంతరపంటగా గంజాయి మొక్కలను పెంచుతున్న పొలంలో దాడి చేసి గంజాయి మొక్కలను దగ్దం చేసినట్లు నారాయణఖేడ్ ఆబ్కారీ సీఐ మహేష్ తెలిపారు. మనూర్ మండలం బాదల్ గమ గ్రామానికి చెందిన బి.సంజీవులు అనే రైతు చెరుకు పంటలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు సమాచారం మేరకు దాడి చేయడం జరిగిందన్నారు. 150 గంజాయి మొక్కలను గుర్తించి …
Read More »ఉపాధి హామీ పనుల పరిశీలన
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలం రత్నగిరి పల్లెలో గురువారం ఉపాధి హామీ పథకంలో చేపట్టిన కాంటూరు కందకాలు, ఉట చెరువులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పనులకు సంబంధించిన వర్క్ ఫైల్ సక్రమంగా ఉండే విధంగా చూడాలన్నారు. ఆధార్ కార్డుల అప్‌డేషన్ పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, అధికారులు, ప్రజా …
Read More »పల్లె ప్రకృతి వనం పరిశీలన
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ పల్లె ప్రకృతి వనంను గురువారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పరిశీలించారు. పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం సంతరించుకుందని పేర్కొన్నారు. ఏడాది వ్యవధిలో పల్లె ప్రకృతి వనం దట్టంగా పెరిగిందని సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్‌కు చెప్పారు. వర్క్ ఫైళ్లను పరిశీలించారు. ఉపాధి హామీ కింద గ్రామంలో చేపట్టిన పనుల …
Read More »ఆరుతడి పంటలపై అవగాహన
నిజాంసాగర్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో యాసంగిలో ఆరుతడి పంటలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి అమర్ ప్రసాద్ మాట్లాడారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన వేరుశనగ, ప్రొద్దు తిరుగుడు, కుసుమ, శనగ, మినుము, జొన్న, మొక్కజొన్న, చెకు, ఆయిల్ పామ్ వంటి పంటలను పండిరచాలని రైతులకు వివరించారు. తరచుగా వరి పంట వేయడం వల్ల కలిగే …
Read More »గోవింద్ పేట్‌లో రైతు అవగాహన సదస్సు
ఆర్మూర్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం గోవింద్ పేట్ గ్రామంలో రైతులకు పయనిర్ కంపెనీ సిబ్బంది మొక్కజొన్నపై అవగాహన కల్పించారు. పయనీర్ కంపెనీ వారి పి3524 అనే రకం మంచి దిగుబడినిస్తుంది సమానమైన కండెలు కలిగి ఉంటుందని, ఒక్కొక్క కండెలో 18 నుంచి 22 వరసలు వస్తాయని ఈ రకం మొక్కజొన్న గాలివానలకు తట్టుకుని నిలబడి ఉంటుందని వివరించారు. అలాగే ఇతర రకాలతో …
Read More »టియులో న్యాయ చైతన్య సదస్సు
డిచ్‌పల్లి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో న్యాయవిభాగంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా న్యాయసేవ సంస్థ కార్యదర్శి జె.విక్రమ్ న్యాయ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థుల పరిణతి వలన సమాజాన్ని చైతన్యపరచాలని ప్రోత్సహించారు. కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు టియు న్యాయవిభాగాధిపతి డాక్టర్ స్రవంతికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ …
Read More »