అధికారులు పాఠశాలలు తనిఖీ చెయ్యాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నుండి స్కూల్స్‌ ప్రారంభం అయినందున పాఠశాలల్లో వసతులు, విద్యార్థుల పరిస్థితులు, కరోన నిబంధనలు ఎలా అమలు జరుగుతున్నాయో అధికారులు పాఠశాలల్లో ప్రత్యక్షంగా పర్యటించి పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుదవారం కలెక్టరేట్‌ నుండి ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.

జిల్లా అధికారులు, డివిజన్‌ మండల స్థాయి అధికారులు, తహసీల్దార్‌లు, ఎంపిడిఓలు, ఎంపిఓలు, ఎంఈఓలు, స్కూల్‌ హెడ్‌ మాస్టర్లు హాజరైన విసిలో ఆయన మాట్లాడుతూ పదహారు నెలల తర్వాత పాఠశాలలు ప్రారంభం అయినాయని కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకొని అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ నిబంధనలు పాటించే విధంగా చూడాలని, ఏ విద్యార్థికి ఏ పాఠశాలలో కూడా ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పాఠశాలల్లో ప్రార్థన మొదలుకొని శానిటేషన్‌, డ్రిరకింగ్‌ వాటర్‌, భోజనాలు, తరగతులు, టాయిలెట్స్‌ , విద్యుత్‌ ఇలా ప్రతి చోట కోవిడ్‌ నిబంధనలు అన్ని స్కూల్‌ లలో అలవాటు చెయ్యాలని, బుధవారం నుండి శనివారం వరకు మండల, స్పెషల్‌అధికారులు, క్లస్టర్‌ అధికారులు స్కూల్‌లు తనిఖీ చేసి రిపోర్ట్‌ సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

16 నెలల తరువాత స్కూల్‌లు ఆన్‌లైన్‌లో నడిచినందున పిల్లలు తిరిగి ప్రత్యక్ష తరగతులకు అలవాటు అయ్యేలా వాతావరణం కల్పించవలసి ఉన్నదని కావున టీచర్‌లు పిల్లలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి పరిశీలన చేసి వారిని తరగతులకు హాజరయ్యేలా శ్రద్ద చూపేలా చూడాలన్నారు. ప్రతి టీచర్‌, పిల్లలు తప్పక మాస్క్‌ పెట్టాలని మాస్క్‌ లేకుండా ఎవ్వరూ అగుపించవద్దని టీచర్‌లు సిలబస్‌, టీచింగ్‌ పై ఎక్కువ ఫోకస్‌ చెయ్యాలని ఆదేశించారు.

టాయిలెట్స్‌, విద్యుత్తు, డ్రిరకింగ్‌ వాటర్‌, శానిటైజర్‌ అందుబాటులో ఉండేవిధంగా సరిగా పనిచేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులు రాకుండా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని స్కూల్స్‌లో శానిటైజ్‌ చేయించాలని, ఏదైనా స్కూల్‌లో టాయిలెట్స్‌ బాగా లేని దగ్గర వెంటనే మరమ్మతులు చేపించాలని అధికారులను ఆదేశించారు.

స్కూల్‌ ఆవరణంలో చెత్త, ఈగలు, దోమలు లేకుండా చర్యలు తీసుకోవాలని, క్లాస్‌ రూమ్‌లో టీచర్‌, ప్రతి విద్యార్థి మాస్క్‌ ధరించి రావాలని, మధ్యాహ్న భోజనం సిద్ధం చేసే దగ్గర వంద శాతం కోవిడ్‌ నిబంధనలు పాటించాలని, ప్రతి క్లాస్‌ టీచర్‌ క్లాస్‌ రూమ్‌లో విద్యార్థులు మాస్కు ధరించి సోషల్‌ డిస్టెన్స్‌లో కూర్చునే విధంగా హెడ్‌ మాస్టర్లు ఆదేశించారు. అన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా చూడాలని ఆదేశించారు.

టీచర్‌లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని స్పెషల్‌ క్లాసెస్‌ నిర్వహించాలని, ఒక నెల పాటు అన్ని స్కూళ్లు, కాలేజీలో బోధించాలని సూచించారు. ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నందున అందుకు అనుగుణంగా ఏ విద్యార్థి కూడా అనారోగ్యం పాలు కాకుండా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఎంపీడీవోలు, తాహసిల్దార్‌లు, ఎంపిఓలు క్లస్టర్‌గా ఏర్పడి ప్రతి స్కూలు పరిశీలించాలని, ప్రతి రోజు జిల్లా అధికారులు వారి పరిధిలో రోజు ఒక హాస్టల్‌ను విజిట్‌ చేసి పిల్లలతో పాటుగా భోజనం చేయాలన్నారు.

కరెంట్‌ కట్‌ చేసిన, కరెంట్‌ లేకున్నా వాటి యొక్క వివరములు అన్ని డిఈఓకు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో శానిటైజ్‌ చేసుకోవాలని సీజనల్‌ వ్యాధులు పెరుగుతున్నవి కావున ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్‌లో ప్రతి ఒక్కరు శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు చిత్ర మిశ్రా, డిఈఓ దుర్గ ప్రసాద్‌, జయసుధ డిపిఓ, అగ్రికల్చర్‌ జెడి గోవింద్‌, జిల్లా అధికారులు, పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »