వేల్పూర్, సెప్టెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం లాకోర గ్రామంలో సీతరామచంద్ర స్వామి ఆలయం ప్రాంగణంలో 12 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణానికి బుధవారం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భూమి పూజచేశారు.
ఈ సందర్భంగా ఆంజనేయస్వామి విగ్రహదాత విద్యాసాగర్ దంపతులు నిర్మాణానికి భూమిపూజ చేసి, సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
కార్యక్రమంలో ఆలయకమిటీ చైర్మన్ బట్టు లక్ష్మణ్, ఎంపీటీసీ గంగామణి, వెల్ఫేర్ సొసైటీ వైస్ చైర్మన్ శ్రీధర్, ఉమ్మెడ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ తిరుమల శ్రీనివాస్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.