ఎడపల్లి, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థుల భవిష్యత్తు కన్నా ముఖ్యమైనది ఏదీ లేదని ఉపాధ్యాయులు ఈ దిశగానే ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం ఎడపల్లి మండలంలోని జానకంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు. 8, 9, 10 తరగతి క్లాసులను పరిశీలించారు. డిజిటల్ తరగతుల ద్వారా ఏం నేర్చుకున్నారని విద్యార్థులను ఆరా తీశారు.
టీచర్లతో మాట్లాడుతూ ఫిజికల్ క్లాసులు ప్రారంభమైనందున ఇన్ని రోజుల పాటు ఏదైతే పిల్లలు ఏదైతే నష్టపోయారో దాన్ని తిరిగి పొందే విధంగా బోధించవలసిన అవసరం ఉందన్నారు. బేసిక్స్ చెప్పాలన్నారు. ప్రతి టీచర్ సిస్టమేటిక్‌గా నెల రోజుల కోసం ప్లాన్ చేసుకోవాలని ప్లాన్ ఏ, ప్లాన్ బి ప్రకారంగా వెళ్లాలన్నారు. ప్లాన్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నారు. కోవిడ్ కారణంగా సంవత్సరన్నర కాలం తర్వాత ఓపెన్ అయినవి కాబట్టి బేసిక్స్ ప్రతి సబ్జెక్టులో రిపీట్ చేయాలన్నారు.
ఒక నెలలో గట్టిగా పనిచేసి విద్యార్థులను తిరిగి పాఠశాల వాతావరణానికి తీసుకురావాలన్నారు. స్కూళ్లల్లో ఏ సమస్య ఉన్నా శనివారం వరకు పూర్తిచేయాలని సర్పంచ్‌ను ఆదేశించారు. సమస్యలుంటే శనివారం వరకు పూర్తిచేయాలని ఎంపిడిఓను ఆదేశించారు. అంగన్వాడీ సెంటర్ పరిశీలించి పిల్లలను దూరం దూరం కూర్చోబెట్టాలని తెలిపారు.
గర్భిణీలు, బాలింత స్త్రీలకు గుడ్లు ఇస్తున్నట్లు అంగన్వాడి టీచర్ తెలిపారు. గ్రామంలో దోమల నివారణకు స్ప్రే చేయాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని ఫాగింగ్ చేయించాలన్నారు. స్కూలు ఆవరణలో మొక్కలు నాటాలని తెలిపారు. కార్యక్రమంలో తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో శంకర్, ఎంపిఓ శ్రీనివాస్, సర్పంచ్ సాయిలు, ఎంఈఓ రామారావు, ఇంచార్జ్ హెచ్ఎం అరుణ ఎస్ఎంసి చైర్మన్ పోశెట్టి, పంచాయతీ సెక్రెటరీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.