ఆర్మూర్. సెప్టెంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫ్రైడే డ్రై డే పాటించాలని ఆరోగ్య కార్యకర్త జక్కుల మోహన్ సూచించారు. శుక్రవారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి లో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా వ్యాధులు వ్యాప్తి చెందే విధానంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆరోగ్య కార్యకర్త జక్కుల మోహన్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమై వర్షాలు కురుస్తున్నందున ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని రోళ్ళు పాత డబ్బాలు కొబ్బరిచిప్పలు పూలకుండీలు వంటి వాటిలో నీరు నిలువకుండా చూసుకోవాలన్నారు. నీరు నిలువ ఉన్నచోట దోమలు వృద్ధి చెంది డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా లాంటి వ్యాధులను వ్యాప్తి చేస్తాయన్నారు.
దోమలు వృద్ధి చెందకుండా వారానికి ఒకసారి శుక్రవారం నీటి నిల్వలను తీసివేసి శుభ్రపరుచుకుని మళ్ళీ నీటిని నింపుకోవాలని సూచించారు. దోమ లార్వాలు నిల్వ ఉన్న వాటిలో తేమో పాస్ మందును పిచికారి చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త శ్యామల, ఆశా కార్యకర్తలు శిరీష, సుభద్ర, అరుణ, రమా, మమత, నవ్య తదితరులు పాల్గొన్నారు.