నిజామాబాద్, సెప్టెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ని జిల్లా ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి భవన్లో ఏర్పాటుచేసిన ఆత్మీయ వీడ్కోలు సమ్మేళన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి హాజరై కామారెడ్డి కలెక్టర్ పదోన్నతిపై వెళ్తున్నందుకు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంవత్సరంన్నర కాలంలో మున్సిపల్ కమిషనర్‌గా చాలా సేవలందించి కార్పొరేషన్‌కు కొత్త రూపురేఖలు తెచ్చారని కొత్త కలెక్టరేట్ ప్రాంగణంలో బైపాస్ రోడ్లో మొక్కలు నాటించి చాలా సుందరంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు చిత్ర మిశ్రా, చంద్రశేఖర్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ మకరంద్, మెప్మా పిడి రాములు జిల్లా అధికారులు పాల్గొన్నారు.