గాంధారి, సెప్టెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సుస్థిర వ్యవసాయం ద్వారా పంటలు పండిరచి లాభాలు సాధించిన రైతులకు వ్యవసాయ ఉత్పాదకతలను జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి అందించారు. శనివారం గాంధారి మండలం పొతంగల్ గ్రామంలో జాతీయ సుస్థిర వ్యవసాయం 21-22 కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
స్థానిక సర్పంచ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా 6 రైతులను ఎంపిక చేశారు. ఒక్కొక రైతుకు ఒక హెక్టారుకు 2500 రూపాయల విలువ గల వ్యవసాయ ఉత్పాదకను (ఇన్పుట్స్ )ను పంపిణీ చేశారు. గ్రామంలో పొన్నాల ఎల్లవ్వ, అటకారి మల్కవ్వ, రాధాబాయి, బిచ్చ, అంజవ్వ, దేమే బాలయ్యలను ఎంపిక చేశారు.
అనంతరం క్షేత్ర ప్రదర్శన చేసి సుస్థిర వ్యవసాయంలో భూసార పరీక్షల ఆధారంగా పంటలు ఏవిధంగా పండిరచాలో అధికారులు సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు రత్న, మండల వ్యవసాయ అధికారి యాదగిరి, రైతులు తదితరులు పాల్గొన్నారు.