ఆర్మూర్, సెప్టెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆర్మూర్ పట్టణంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సిలిండర్ తో నిరసన తెలిపారు. అనంతరం సిపిఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పి వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధరలు అదుపు చేయకపోగా డీజిల్ ధరలు పెట్రోల్ వంట గ్యాస్ ధరలు పెంచుతుందన్నారు.
సామాన్య ప్రజలపై భారాలు వేయడం తప్ప మరొకటి కాదని, పెట్టుబడిదారులకు సామ్రాజ్యవాదులకి అనుకూలంగా చట్టాలు సవరించడం రాయితీలు ఇవ్వటం సిగ్గుచేటు అన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం వలన నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్యులు కొనలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. ఇప్పటికే కరోనాతో ప్రజలు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ, పనులు లేక ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవడానికి డబ్బులు లేక అనేక అవస్థలు పడుతున్నారని ప్రభుత్వం వారిని ఆదుకోవడంలో వైఫల్యం చెందిందన్నారు.
కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, ధరలను అదుపు చేయాలని, పేద ప్రజలకు 7 వేల 500 రూపాయలు ఆరు నెలలపాటు ఇవ్వాలని నిత్యావసర సరుకులతో పాటు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇంటింటికి తిరిగి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి ఎల్లయ్య. మండల కమిటీ సభ్యులు రాజు, వీణ గంగాధర్, సంధ్య, మల్లేష్, కుల్దీప్ శర్మ, సాయి, బేగం, సాయి బాయి తదితరులు పాల్గొన్నారు.