కామారెడ్డి, సెప్టెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండలం ముత్యంపేట పల్లె ప్రకృతి వనంను శనివారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సందర్శించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులను తరగతి గదుల్లో కూర్చుబెడుతున్నామని ఉపాధ్యాయులు తెలిపారు.
తరగతి గదిలో ప్రత్యక్ష బోధన ద్వారా పాఠాలు సులభంగా అర్థం అవుతున్నాయని విద్యార్థులు చెప్పారు. విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీని సందర్శించారు. రోడ్లపై మురుగు నీరు లేకుండా చూడాలని సూచించారు. పరిశుభ్రమైన తాగునీరు అందే విధంగా చూడాలని కోరారు.