గాంధారి, సెప్టెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండల నూతన మహిళా సమాఖ్య పాలకవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఐకేపీ కార్యాలయంలో 15 వ వార్షిక మహాసభ సమావేశం నిర్వహించారు. సంవత్సరంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై చర్చించారు.
అనంతరం నూతన పాలక వర్గాన్ని ఎన్నుకున్నారు. మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా సితాయిపల్లికి చెందిన జ్యోతి, ఉపాధ్యక్షురాలుగా పెట్ సంగం గంగవ్వ, కార్యదర్శిగా నవనీత, సహాయ కార్యదర్శిగా లింగవ్వ, కోశాధికారిగా కవిత బూర్గుల్లను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి రమేష్ బాబు, డీపీఎం రవీందర్, ఏపీఎం గంగరాజు, డి యంజి సంగమేశ్వర్, సీసీలు, మహిళలు పాల్గొన్నారు.