ఇక్కడ సమస్యలు… ఢిల్లీలో సంబరాలు…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అడ్లూర్‌ గ్రామానికి చెందిన అధికార తెరాస పార్టీకి చెందిన మాజీ కో-ఆప్షన్‌ సభ్యులు అబ్దుల్‌ హఫీజ్‌, మాజీ గ్రామ తెరాస అధ్యక్షుడు మేడిపల్లి నర్సింలు, తెరాస సీనియర్‌ నాయకులు మహేందర్‌, రాంరెడ్డి, రాజు, శ్రీనివాస్‌,అనిల్‌, రమేష్‌, రాజాగౌడ్‌, రాజశేఖర్‌లతో పాటు ఆరుగురు యువకులు బిజెపి కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ మోదీ సారధ్యంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కుల, మత, ప్రాంతాలకు అతీతంగా దేశము అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, రాష్ట్రంలో గత ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓడినప్పటికి ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల పక్షాన నిలబడుతుందని రాష్ట్ర రథసారథి బండి సంజయ్‌ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల వద్దకే ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా వెళుతున్నారన్నారు. ప్రజలు, నిరుద్యోగులు సమస్యలు ఎదుర్కొంటుంటే అధికార పార్టీ నేతలు ఢల్లీిలో సంబరాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »