కామారెడ్డి, సెప్టెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన బుక్క రజని శనివారం కామారెడ్డి జిల్లా విద్యాశాఖ ప్రకటించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు పురస్కారానికి ఎంపికయ్యారు.
ప్రస్తుతము సదాశివనగర్ మండలం మల్లుపేట్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా గత 7 సంవత్సరాల నుండి రజిని విధులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక బోధనా పద్ధతుల ద్వారా 20 మంది విద్యార్థులను గురుకుల పాఠశాలకు ఎంపికయ్యే విధంగా కృషి చేశారు. అవార్డుకు ఎంపిక చేసినందుకు జిల్లా విద్యాశాఖ అధికారి రాజుకు, మండల విద్యాశాఖ అధికారి యోసఫ్కు, సెక్టోరియల్ అధికారులు గంగాకిషన్కు కృతజ్ఞతలు తెలిపారు.