నిజామాబాద్, సెప్టెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ ప్రయోజనాల కోసమే జాతీయ లోక్ అదాలాత్ నిర్వహిస్తున్నామని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్ ఎస్.గోవర్ధన్ రెడ్డి తెలిపారు. 11 వ తేదీన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న లోక్ అదాలత్ విధి, విధానాలను తెలియజేస్తు సంస్థ కార్యాలయం న్యాయసేవా సదన్‌లో నిర్వహించిన భౌతిక, వర్చుల్ సమావేశాల్లో ఆయన న్యాయాధికారులను ఉద్దేశించి మాట్లాడారు.
రాజీపడదగిన క్రిమినల్ కేసులను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటు, పోలీసులను, న్యాయవాదులను సమన్వయం చేసుకోవాలన్నారు. భౌతికంగా, వర్చుల్‌గా కక్షిదార్లు హాజరుకు అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంబందిత పోలీస్ స్టేషన్ అధికారుల సేవలు వినియోగించుకోవాలని, వారి భాగస్వామ్యం ఉన్నదని అన్నారు.
సివిల్ దావాలను కక్షిదారుల ఉమ్మడి అంగీకారం మేరకు అవార్డులు జారీ చేస్తామని ఇవి అంతిమమని అప్పీల్‌కు వీలులేని విషయాన్ని తెలియచేయాలని పేర్కొన్నారు. అదనపు జిల్లా జడ్జి గౌతమ్ ప్రసాద్ మాట్లాడుతు న్యాయసేవా సంస్థ భాగస్వాములను భాగస్వామ్యం చేసుకున్నపుడే అనుకున్న పలితాలు వెలువడుతాయని తెలిపారు. అందరం ఏకమై జాతీయ లోక్ అదాలాత్‌ను విజయశిఖరాలకు చేర్చి న్యాయసేవలను న్యాయార్తులకు అందిద్దామని అదనపు జిల్లా జడ్జిలు షౌకథ్ జహన్ సిద్ధికీచ పంచాక్షరీ తెలిపారు.
భౌతిక,వర్చువల్ సమావేశంలో అదనపు జిల్లా జడ్జి(బోధన్) సూర్య చంద్రకళ, సీనియర్ సివిల్ జడ్జిలు కిరణ్ మహి, శివరాం ప్రసాద్, జూనియర్ సివిల్ జడ్జిలు కళార్చన, భవ్య, సౌందర్య, గిరిజ, మల్లాది అపర్ణ, అనిత, వింధ్య నాయక్, శాలిని, ఉమా మహేశ్వరి, పెద్ది చందన, గౌస్ ఎమ్.డి.పాషా తదితరులు పాల్గొన్నారు.