వారం రోజుల్లోగా వాక్సినేషన్‌ అందించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 సంవత్సరములు పైబడిన విద్యార్థులందరికీ వారం రోజులలోగా కోవిడ్‌ వాక్సినేషన్‌ అందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల ప్రిన్సిపల్స్‌, యాజమాన్యాలను ఆదేశించారు.

శనివారం కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన సమావేశంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ప్రిన్సిపాల్స్‌, యాజమానులతో విద్యార్థులకు అందించే కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ పై కాలేజీల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్ధులందరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరచాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థికి వ్యాక్సినేషన్‌ అందించాలని, అలాగే కొత్తగా వచ్చే విద్యార్థులను కూడా పరిగణలోకి తీసుకోవాలని, అదే విధంగా అధ్యాపకులు, సిబ్బంది కూడా తప్పనిసరిగా వ్యాక్సినేషన్‌ పొంది ఉండాలని ఆదేశించారు.

విద్యార్థుల వివరాలను కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌, కార్యక్రమ కోఆర్డినేటర్‌ ఎం. చంద్రకాంత్‌కు అందించాలని సూచించారు. విద్యార్థుల వివరాలను బట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖచే వ్యాక్సినేషన్‌ అందించడం జరుగుతుందని తెలిపారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి కాలేజీలలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

సమావేశంలో ప్రిన్సిపల్‌ ఎం. చంద్రకాంత్‌, మరకల్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ప్రిన్సిపాల్‌ సోషల్‌ వెల్ఫేర్‌ డిగ్రీ కాలేజ్‌ ప్రిన్సిపల్‌ రాధిక, కామారెడ్డి డైరీ టెక్నాలజీ, మాల్‌ తుమ్మెద అగ్రికల్చరల్‌ డిప్లొమా కాలేజీ, బికనూర్‌ మైనారిటీ బిఈడి కాలేజ్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకుల డిగ్రీ కాలేజీ, కర్షక్‌ బిఈడి కాలేజీ, బిచ్కుంద బిఈడి కాలేజీల ప్రిన్సిపాల్స్‌, ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీ లెక్చరర్లు, ప్రతినిధులు హాజరయ్యారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »