భీమ్‌గల్, సెప్టెంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ వన్ టౌన్ సెంటర్ షి టీం డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో మహిళలకి జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు, సెక్సువల్ అర్రస్మెంట్స్, వరకట్న వెధింపుల వల్ల బాధపడే మహిళలకు నిజామాబాద్ సఖి సెంటర్ అవగాహన సదస్సు నిర్వహించారు.
నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో లింబాద్రి గుట్ట పుణ్యక్షేత్రంపై మహిళలకి అవగాహన, భీంగల్‌లో సఖి సెంటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. సఖి ఓఎస్‌సి సర్వీసులు, అత్యవసర హెల్ప్ లైన్ నెం. డబ్ల్యుహెచ్‌ఎల్ 181, 100, 1098, గృహహింస చట్టం, బాల్య విహాహల చట్టం, పోక్సో చట్టం మొదలైన వాటి గురించి పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులకు వివరించారు. కార్యక్రమంలో భీమ్‌గల్ ఎస్‌ఐ ప్రభాకర్, సఖి అడ్మిన్ భానుప్రియ, సోషల్ కౌన్సిలర్ స్వరూప, సఖి సిబ్బంది, లింబాద్రి గుట్ట పుణ్యక్షేత్రం వంశపర్య వ్యవస్థాపకులు నంభి పార్ధసారధి తదితరులు పాల్గొన్నారు.