భీమ్‌గల్, సెప్టెంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రావణమాసం చివరి శనివారం కావడంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. భీంగల్ ఎస్‌ఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించి ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు, భక్తుల తోపులాట తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు… శ్రావణమాసం చివరి శనివారం పురస్కరించుకుని భీంగల్ మండల కేంద్రం లోని శ్రీ లింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి లింబాద్రి గుట్ట పైన శనివారం లక్ష్మి నృసింహ స్వామి వారి దర్శనం కోసం ఉదయం నుండే బారికెట్ల మధ్య లైన్‌లో బారులు తీరారు.
స్వామి వారి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. భక్తులు కోరిన కోరికలు నెరవేరాలని అర్చకులు నంబి పార్థ సారథి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రావణమాసం ముగియనుండడంతో స్వామి వారికి సాహిత్యం ఇచ్చే భక్తులు వారి వారి సాహిత్యాలు కానుకలు అందజేసి వారి మొక్కులు తీర్చుకున్నారు.
శనివారం రోజు జిల్లా నలు మూలాల నుండి వచ్చిన భక్తులు వేల సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకుని అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకొని స్వామి వారి కృపకి పాత్రులు కావాలని దీవించారు.