నిజామాబాద్, సెప్టెంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారీగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి పోలీసులు హెచ్చరిక జారీచేశారు. వాగులు, కాలువలు, నదులు రిజర్వాయర్‌ల వద్దకు ప్రజలు వెళ్ళరాదని, ముఖ్యంగా పిల్లలు యువకులు వెళ్ళవద్దని పేర్కొన్నారు. గ్రామ పెద్దలు, గ్రామ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని, నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల వద్దకు వెళ్ళరాదని, నాలాలు, వాగులు ప్రవహిస్తున్న రహదారులను దాటరాదన్నారు.
చెట్ల కింద, పాడైన భవనాలు కింద, శిధిలావస్థలో ఉన్న భవనాలు కింద ఉండరాదని, రహదారులు వర్షానికి తడిచి ఉన్నందున నెమ్మదిగా వాహనాలను నడపాలని, అనవసర ప్రయాణాలను రద్దు చేసుకోవాలని, అత్యవసర సమయంలో డయల్ 100 ఉపయోగించండని పోలీసులు తెలిపారు.