నిజామాబాద్, సెప్టెంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని లోతట్టు ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను, నీటమునిగిన ఇండ్లను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పర్యటించి పరిశీలించారు. మంగళవారం నగరంలోని ఆటోనగర్, నయా బ్రిడ్జి ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, ఇండ్లు పరిశీలించారు.
టీంలను ఏర్పాటు చేసి నష్టాన్ని అంచనా వేయించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గూపన్పల్లి నిర్వాసితులు గంగ స్థాన్ ప్లే స్టోర్‌లో కొత్త అపార్ట్ మెంట్ లో పునరావాసం పొందుతున్న 32 కుటుంబాలు 120 మందికి, పాంగ్రా భట్ రాజ్ సంఘంలో 15 కుటుంబాలు 60 మందికి దుప్పట్లు అందజేశారు. భోజన ఏర్పాట్లు చేశారు. మెడికల్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ వెంబడి కలెక్టర్లు చిత్ర మిశ్రా, చంద్రశేఖర్, ఇరిగేషన్ సిఈ మధుసూదన్ రావు, డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, ఆర్డిఓ రవి, తహసిల్దార్లు ప్రశాంత్ కుమార్, చాంద్ భాష మున్సిపల్ రెవిన్యూ అధికారులు ఉన్నారు.