నిజామాబాద్, సెప్టెంబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి నిజామాబాద్ కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. కాలోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన జయంతిని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కాళోజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కాళోజీ సేవలను, ఆశయాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నిజామాబాద్ ఆర్డివో రవి, మెప్మా పిడి రాములు, బీసీ సంక్షేమ అధికారి రమేష్, డిసిఓ సింహాచలం, కలెక్టరేట్ ఏవో సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.