కామారెడ్డి, సెప్టెంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా బూరుగుపల్లి గ్రామానికి చెందిన సౌజన్య (21)కు ఆపరేషన్ నిమిత్తమై జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం దొరకక పోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని గురించి తెలుసుకొని వారి బంధువులు నిర్వాహకుడు బాలును సంప్రదించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కిరణ్ సహకారంతో 44 వ సారి ఓ నెగిటివ్ రక్తాన్ని సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ గత 13 సంవత్సరాల నుండి కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, రామాయంపేట, మెదక్, ముస్తాబాద్, ప్రాంతాలలో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి సకాలంలో ఇప్పటివరకు 8 వేల 500 యూనిట్లకు పైగా రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడామన్నారు.
రెండు నెలల నుండి జిల్లాలో డెంగ్యూ కేసులు పెరిగిపోవడం వలన 50 మందికి సకాలంలో ప్లేట్ లేట్లను అందించి ప్రాణాలు కాపాడామన్నారు. కిరణ్‌ను స్ఫూర్తిగా తీసుకొని రక్తదానానికి ముందుకు రావాలని, రక్తదానం చేసిన కిరణ్‌ను అభినందించారు. కార్యక్రమంలో అన్వేష్, రాజు, టెక్నీషియన్ చందన్ పాల్గొన్నారు.