కామారెడ్డి, సెప్టెంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నా ప్రభుత్వం నివారణకు చర్యలు చేపట్టడంలో విఫలమయ్యిందిని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్ ఆరోపించారు. ప్రభుత్వం సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా లేదని, దీంతో నిరుపేదలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేల రూపాయలు చెల్లించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
కామారెడ్డి జిల్లాలో గత కొద్దిరోజులుగా డెంగ్యూ విజృంభిస్తుందని తెలిపారు. దీనిపై జిల్లా స్థాయి అధికారులు ఇప్పటి వరకు సమీక్షలు జరగకపోవడం శోచనీయం అని అన్నారు. పంచాయతీల్లో మున్సిపాలిటీల్లో తాగునీరు కలుషితం కాకుండా చూడాలని, అన్ని గ్రామాల్లో పట్టణాల్లో దోమల బెడద నివారణకు ఫాగింగ్ చేయాలని కైలాస్ శ్రీనివాస్ రావు ప్రభుత్వ ఉన్నత అధికారులను కోరారు.