కామరెడ్డి, సెప్టెంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పార్టీలకు గ్రామ కమిటీలే కీలకం అని మైలారం సింగిల్ విండో చైర్మన్ పెరుక శ్రీనివాస్ అన్నారు. మండలంలోని మైలారం టీఆర్‌ఎస్ పార్టీ నూతన గ్రామ కమిటీని మండల తెరాస అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ఒండ్ల మహేందర్ ఆధ్వర్యంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాయిరాం యాదవ్, ఉపాధ్యాక్షుడిగా ధూళి గంగారాం, కార్యదర్శిగా బొట్టే రమేష్‌లను, టీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడుగా మహేందర్ గౌడ్, కార్యదర్శిగా సాయగౌడ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా పెరుక శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో గ్రామ స్థాయి కార్యకర్తలు కీలకం అన్నారు. అనంతరం నూతన మైలారం తెరాస గ్రామ కమిటీ అధ్యక్షుడు సాయిరాం యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ తనకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తా అని, పార్టీ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.