నిజామాబాద్, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో అధికారులతో సమన్వయ సమావేశంలో అధిక వర్షం వల్ల దెబ్బతిన్న, ప్రజావాణి దరఖాస్తులు, గణేష్ నిమజ్జనం, హరితహారం, స్కూల్స్ విసిట్పై జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధిక వర్షాలకు దెబ్బతిన్న పంట, వ్యవసాయ శాఖ, రోడ్లు, పంచాయతీ రాజ్, ఆర్అండ్బి బ్రిడ్జిలు, ఇరిగేషన్ ట్యాంకులు, ఇండ్లు బుధవారంలోగా సంబంధిత శాఖలు లైన్ టెస్ట్ మిషన్‌తో బుధవారం సాయంత్రం వరకు సబ్మిట్ చేయాలన్నారు.
ప్రజావాణి దరఖాస్తులు వెంటవెంటనే పరిష్కరించాలని పెండిరగ్లో ఉన్నవి సోమవారం వరకు క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 19న నిర్వహిస్తున్న గణేష్ నిమజ్జనం కేర్ తీసుకోవాలని స్పెషల్ నోడల్ ఆఫీసర్స్ నిమజ్జనం ఏర్పాట్లు, రోడ్డు రూట్ వారిగా విద్యుత్ శాఖ ప్రాపర్‌గా చూడాలని లూస్ వైర్స్ ఉంటే సరి చేయాలన్నారు.
ప్లాన్ చేసుకోవాలన్నారు. నిమజ్జనం రోడ్స్ ప్యాచ్‌లు ఉన్న మున్సిపల్ అధికారులు సరి చేయించాలన్నారు. నిమజ్జన సమయంలో ఎక్కడా ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో గణేశ్ ఉత్సవ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నారు. అధికారులు నిమజ్జనం పాయింటు పరిశీలించాలన్నారు. 24 గంటలు మూడు షిఫ్టులో డ్యూటీలు చేయాలని తెలిపారు.
హరితహారం టార్గెట్ పూర్తయిందని జియో ట్యాగింగ్ పెండిరగ్ ఉందని, పూర్తి చేయాలన్నారు. మొక్కల ప్రొటెక్షన్‌పై వంద శాతం పెట్టిన మొక్కలు బ్రతకాలి అన్నారు. స్కూల్స్ బుధవారం రోజు జిల్లా అధికారులు విజిట్ చేయాలని శానిటేషన్, తాగునీరు, టాయిలెట్స్, స్కావెంజర్ ఏర్పాటు, మిడ్ డే మీల్స్ పరిశీలించాలని స్కూల్ హెచ్ఎం ప్లాన్, బేసిక్స్ రివ్యుస్ కావాలన్నా ప్రతి క్లాసులో ప్లాన్ ఏ, ప్లాన్ బి పరిశీలించాలన్నారు. మిషన్ భగీరథ వాటర్ ప్రతి స్కూల్ పిహెచ్సి సెంటర్ హాస్టల్లో నల్ల కనెక్షన్ ఉండాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు చిత్ర మిశ్రా, చంద్రశేఖర్, ఏసీపీ శ్రీనివాస్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.