గెస్ట్‌ ఫ్యాకల్టీని రెన్యువల్‌ చేయాలి…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో పనిచేస్తున్న గెస్ట్‌ ఫ్యాకల్టీని ఈ విద్యాసంవత్సరం రెన్యువల్‌ చేయాలని 18 నెలలుగా పెండిరగ్‌లో ఉన్న వారి జీతాలని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పిడిఎస్‌యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం డిఐఇవోకి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షురాలు కల్పన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 404 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో 1658 గెస్ట్‌ ఫ్యాకల్టీ వాళ్లు పనిచేస్తున్నారన్నారు. వీరిని ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెన్యువల్‌ చేయాలి, కానీ ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వం రెన్యువల్‌ చేయలేదు తద్వారా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.

18 నెలలుగా వీరికి ప్రభుత్వం జీతబత్యాలు చెల్లించ లేదన్నారు. ఫిజికల్‌ క్లాసులు ప్రారంభమై 13 రోజులు కావస్తున్నా రెన్యువల్‌ చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. 18 నెలలుగా జీతాలు రాక ఈ విద్యాసంవత్సరం రెన్యువల్‌ చేయకపోవడంతో ఉద్యోగం లేక గెస్ట్‌ ఫ్యాకల్టీలు తీవ్ర మనోవేదనకు గురవుతూ, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.

ఇటీవల నాగర్‌ కర్నూలు జిల్లాలో గణేష్‌ అధ్యాపకుడు ఆత్మహత్య చేసుకోవడం వాళ్ల దయనీయ పరిస్థితికి నిదర్శనం అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని పిడిఎస్‌యు ఖండిస్తుందన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి గెస్ట్‌ ఫ్యాకల్టీని రెన్యువల్‌ చేయాలని, పెండిరగ్‌ జీతాలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌతం కుమార్‌, ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌, జిల్లా నాయకులు ప్రత్యూష, సాయికృష్ణ, చందు, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »