నిజామాబాద్, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అకాల వర్షాల వల్ల వరదలతో నష్టపోయిన బాధితులకు, ఇండ్లు కోల్పోయిన వారికి రెడ్ క్రాస్ సంస్థ తరపున గంగాస్థాన్లో సోమవారం టార్పాలిన్ కిట్స్, అత్యవసర సామగ్రిని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పంపిణీ చేశారు.
కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రామచందర్, సెక్రటరీ ఆంజనేయులు, సొసైటీ కోశాధికారి రవీందర్, రామకృష్ణ, పిఆర్ఓ, తహసీల్దార్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.