పోషకాహారంపై అవగాహన

గాంధారి, సెప్టెంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని బీర్మల్‌ తండాలోని అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం పోషకాహారంపై అవగాహన కల్పించారు. పోషకాహార వారోత్సవాలలో భాగంగా గర్భిణీలకు, బాలింతలకు, కిశోర బాలికలకు సంపూర్ణ పోషకాహారం తీసుకోవడం వలన కలిగే లాభాల గురించి వివరించారు.

పోషకాహార లోపాన్ని నివారించడానికి తీసుకోవలసిన ఆహార పదార్థాల గురించి తెలిపారు. ఈ సందర్బంగా పోషకాహార విలువలు తెలిసే విధంగా మహిళలు వేసిన ముగ్గులు పలువురిని ఆకర్షించాయి. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్‌ శాంత, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »