కామారెడ్డి, సెప్టెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆదేశానుసారం కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విన్నవించారు.
ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కుంటా లక్మరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడక ముందు సెప్టెంబర్ 17 ను నిర్వహించాలని ఉద్యమాలు చేసిన కెసిఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత మాట మార్చడం విడ్డూరమని ఎంఐఎం మెప్పు కోసమే విమోచన దినోత్సవం మరిచారా అని ప్రశ్నించారు. ఇకనైనా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17 న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
నిజాం రజాకార్ల ఆగడాలను, నాటి తెలంగాణ పోరాటాయోధులు ఎదుర్కొన్న తీరును, విమోచన పోరాటాన్ని పాఠ్యంశంగా చేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పోరాటం జరిగిన స్థలాలను స్మృతి కేంద్రాలుగా తీర్చి దిద్దాలని డిమాండ్ చేశారు.