వేల్పూర్, సెప్టెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హిందీ దివస్ సందర్భంగా వేల్పూర్ మండలం కుక్కునూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ పండిత్ ఉపాధ్యాయుడు గటడి శ్రీనివాస్‌ని పాఠశాల ఉపాధ్యాయ బృందం శాలువాల, పూలమాలతో ఘనంగా సన్మానించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నారాయణ మాట్లాడుతూ గటడి శ్రీనివాస్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు మంచి బోధన అందిస్తున్నారని, హిందీపట్ల శ్రద్దను పెంచుతున్నారని అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేందర్, సాయిలు, సునీల్, మోహన్, కృష్ణ, అశోక్, విద్యార్థులు పాల్గొన్నారు.