హైదరాబాద్, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 26న చాకలి ఐలమ్మ జయంతిని అన్ని జిల్లాల్లో నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖకు, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.