కామారెడ్డి, సెప్టెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ పెద్ద చెరువులో రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్న 1 లక్ష 15 వేల 480 చేప పిల్లలను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ కలిసి వదిలారు.
ఈ సందర్భంగా విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ మత్స్య కారులు రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్న చేప పిల్లల పతకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా ఆర్థికంగా ఎదగాలని సూచించారు. వారి వెంట పలువురు నాయకులు ఉన్నారు.